అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' సినిమా యూత్‌లో ఓ సంచనలనం. సినిమాగా కాకుండా నేచురలిటీకి చాలా దగ్గరగా ఆ సినిమాలోని క్యారెక్టర్స్‌ని డిజైన్ చేశాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆ సినిమాకి అందుకే యూత్ అంతగా కనెక్ట్ అయ్యారు అప్పట్లో. మంచి విజయం అందుకుంది 'హ్యాపీడేస్' అప్పట్లో. ఆ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన నటీనటుల్లో యంగ్ హీరో నిఖిల్ ఒకడు.
'హ్యాపీడేస్' సినిమా తనకి ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకం అంటున్నాడు నిఖిల్. తాజాగా 'కిరాక్ పార్టీ' సినిమాతో వస్తున్నాడు. ఇది ఓ కాలేజీ ప్రేమ కథ. అప్పటి హ్యాపీడేస్ సినిమాని తలంపిస్తోందట ఈ సినిమా. ఈ సినిమాలో కాలేజీనే మెయిన్ హీరో అంటున్నాడు మనోడు. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రన్, సంయుక్త హెగ్దే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన 'కిరిక్ పార్టీ' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది.
ఆ సినిమాలోని మెయిన్ ఎలిమెంట్‌ని మాత్రమే తీసుకుని, అక్కడక్కడా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. అందులోనూ నిఖిల్ అంటే ఎనర్జీకి పెట్టింది పేరు. నిఖిల్ జోరుకు తగ్గట్లుగా హీరో క్యారెక్టరైజేషన్‌లో కొన్ని మార్పులు చేశారట. టోటల్‌గా కావాల్సినంత వినోదం, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, మనసును టచ్ చేసే సన్నివేశాలు చాలా ఉండబోతున్నాయట 'కిరాక్ పార్టీ'లో.
తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ మధ్య 'కేశవ' సినిమాతో సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించి, హిట్ కొట్టిన నిఖిల్ ఈ సినిమాలో సూెపర్బ్ జోష్‌తో కనిపిస్తున్నాడు. చూడాలి మరి ఈ 'కిరాక్ పార్టీ'తో మన నిఖిల్ ఆయడిన్స్‌కి ఎంత కిర్రాకు పుట్టిస్తాడో!