ఈషా రెబ్బా.. జాక్ పాట్ కొట్టింద‌బ్బా..!

మరిన్ని వార్తలు

ఈషారెబ్బా.. తెలుగు అమ్మాయే. అందంగా ఉంటుంది. అభిన‌యం కూడా వ‌చ్చు.కాక‌పోతే.. గుర్తుండిపోయే సినిమాలేం చేయ‌లేదు. అడ‌పా ద‌డ‌పా క‌నిపిస్తుందంతే. ఇటీవ‌ల `త్రీ రోజెస్‌` అనే ఓ వెబ్ సిరీస్ చేసింది. `అర‌వింద స‌మేత‌`లో పూజా సోద‌రిగా న‌టించింది. నాలుగైదు సినిమాల్లో హీరోయిన్‌. అంతే. అందులో ఒక‌ట్రెండు హిట్స్ ఉన్నా, పెద్ద‌గా గుర్తింపు రాలేద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్త‌బోతోంది. ఐటెమ్ గాళ్ గా. అవును.. ఇషా రెబ్బా త్వ‌ర‌లోనే ఓ ఐటెమ్ సాంగ్ చేయ‌బోతోంద‌ని టాలీవుడ్ టాక్.

 

రవితేజ, నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో `ధమాకా` అనే సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ‘సినిమా చూపిస్తమావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే’ లాంటి వినోదాత్మ‌క చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు త్రినాథ‌రావు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, అందులో అనసూయ నర్తించబోతోందని ఇప్పటి వరకూ వార్తలు వినిపించాయి.

 

అయితే ఇప్పుడు ఆ సాంగ్ కోసం ఇషా రెబ్బాని ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. ఈ పాట కోసం అన‌సూయ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో, ఈషా రెబ్బా వైపు చిత్ర‌బృందం మొగ్గుచూపింద‌ట‌. ఈ పాట క్లిక్క‌యితే. టాలీవుడ్ కి కొత్త ఐటెమ్ గాళ్ దొరికిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS