కన్నడలో ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయ్‌.!

By iQlikMovies - October 02, 2018 - 11:32 AM IST

మరిన్ని వార్తలు

కన్నడ బ్యూటీలు తెలుగులో హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే మన తెలుగమ్మాయిలు కూడా తమిళ ఇతర భాషల్లో స్టార్‌డమ్‌ సంపాదించుకుంటున్నారు. 

తాజాగా మన తెలుగమ్మాయి ఈషారెబ్బ కూడా కన్నడలో తన అదృష్టం పరీక్షించుకోనుంది. కన్నడ ప్రముఖ హీరో శివరాజ్‌కుమార్‌ సరసన నటించే బిగ్‌ ఆఫర్‌ కొట్టేసిందట ఈషారెబ్బ. ఎంట్రీకే ఇంత అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ఈషా రెబ్బ కన్నడ ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోందో చూడాలి మరి. 

ఇకపోతే తెలుగులో 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాకే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 'అమీతుమీ'తో పాపులర్‌ అయ్యింది. 'అ' లో డిఫరెంట్‌ రోల్‌ పోషించి ఎలాంటి పాత్రకైనా తాను సెట్‌ అయిపోగలను అని నిరూపించుకుంది. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 'అరవింద సమేత'లో కీలక పాత్ర పోషిస్తోంది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఈషా కెరీర్‌కి అత్యంత కీలకమైందని చెప్పాలి. అలాగే నటిగా ప్రూవ్‌ చేసుకోవాలంటే ఒకే భాషకు కమిట్‌ అయిపోతే కుదరదంటోంది. 

అన్ని భాషల్లోనూ టాలెంట్‌ చూపించాలంటోంది అందాల ఈషా. నిజమే ఆమె ఆటిట్యూడ్‌ మెచ్చుకోదగ్గదే. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడలో అడుగు పెట్టిన ఈషా రెబ్బ ముందు ముందు ఇంకెన్ని భాషల్లో ఎంట్రీ ఇస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS