అడల్ట్‌ కంటెంట్‌ అయినా ఆ హీరోయిన్‌కి ఫర్లేదట.!

మరిన్ని వార్తలు

ట్రెండ్‌ మారిందనీ, ఇప్పుడంతా వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోందనీ, బాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లుగా సత్తా చాటుతున్నవారు కూడా వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారంటూ పలువురు హీరోయిన్లు, వెబ్‌ సిరీస్‌ల బాట పడ్తున్నారు. అయితే, వెబ్‌ సిరీస్‌లు అనగానే ముందుగా అడల్ట్‌ కంటెంట్‌ గుర్తుకొస్తోంది చాలామందికి. అన్నీ అలాంటివే ఎందుకుంటాయ్‌.? అన్నది వేరే చర్చ. కానీ, వెబ్‌ సిరీస్‌కి సంబంధించి కంటెంట్‌ అనగానే ముందుగా అందులో అడల్ట్‌ కంటెంట్‌కి ఎక్కువ స్కోప్‌ వుంటోందన్నది నిర్వివాదాంశం. వెబ్‌ సిరీస్‌లకు సెన్సార్‌ వుండదు. ఇదే చాలామందిని ఎట్రాక్ట్‌ చేస్తోంది. మొబైల్‌ ఫోన్లలోనూ ఈ కంటెంట్‌ని తిలకించేయడానికి వీలు కలుగుతోంది.

 

మరోపక్క, రెమ్యునరేషన్స్‌ కూడా బాగానే లభిస్తుండడంతో అటువైపు వెళుతున్న హీరోయిన్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈషా రెబ్బా తదితరులు ఇప్పటికే ఈ క్లబ్‌లో చేరిపోయారు. మరికొందరూ ఇదే బాటలో నడుస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఫేవ్‌ు కోల్పోతోన్న ఓ ప్రముఖ హీరోయిన్‌, హాట్‌ అండ్‌ వైల్డ్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా త్వరలో హల్‌చల్‌ చేయబోతోందట. ఫ్లాపుల మీద ఫ్లాపులొస్తున్నా, సినిమా అవకాశాలు బాగానే వున్నాయి ఆమెకి. అయితే, గ్లామర్‌ వుండగానే అన్నీ చక్కబెట్టేసుకోవాలన్న ఆలోచనతో ఆ బ్యూటీ, భారీ మొత్తం రెమ్యునరేషన్‌కి డీల్‌ సెట్‌ చేసుకుని, వెబ్‌ సిరీస్‌లో నటించబోతోందట. ఆ వివరాలేంటో ముందు ముందు తెలియబోతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS