పోలీస్ అధికారిణికి చిరు సెల్యూట్‌!

మరిన్ని వార్తలు

ట్విట్ట‌ర్ లోకి అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ.. చిరు య‌మ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు, కుటుంబంతో అనుబంధం, లాక్‌డౌన్ స‌మ‌యంలో చేస్తున్న కాల‌క్షేపం, పాత సినిమా విశేషాలూ ఇలా అన్నీ అభిమానుల‌తో పంచుకుంటున్నాడు. త‌న మ‌న‌సుని క‌దిలించిన వ్య‌క్తుల గురించీ, సంఘ‌ట‌న‌ల గురించీ ఫ్యాన్స్ తో చ‌ర్చిస్తున్నాడు. తాజాగా ఓ పోలీస్ అధికారిణి సేవాగుణం చిరుని క‌దిలించింది. ఒడిస్సాకి చెందిన పోలీస్ అధికారిణి శుభ‌శ్రీ - ఓ వృద్ధురాలికి భోజ‌నం తినిపిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. ఆ వీడియోని మాతృ దినోత్స‌వం సంద‌ర్భంగా చిరు ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు.

 

ఇప్పుడు ఆ అధికారిణితో వీడియో చాట్ చేశారు. శుభ‌శ్రీ చేసిన సేవ‌ని కొనియాడారు. ``మీరు వృద్ధురాలికి భోజ‌నం తినిపిస్తున్న వీడియో న‌న్ను క‌దిలించింది. అప్ప‌టి నుంచీ మీతో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాను. మీలో ఓ త‌ల్లి హృద‌యాన్ని చూశాను`` అంటూ చిరు ఆమెను ప్ర‌శంసించారు. అందుకు సంబంధించిన వీడియోని చిరు ట్విట్ట‌ర్ లో పంచుకున్నారు. ఓ మంచి ప‌ని చేసిన వ్య‌క్తిని ప‌ని గ‌ట్టుకుని అభినందించ‌డం, ఆ విష‌యాన్ని అభిమానుల వ‌ర‌కూ తీసుకువెళ్ల‌డం చిరు వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఇప్పుడు ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS