పదహారణాల తెలుగమ్మాయ్ మన ఈషా రెబ్బా 'సైమా' అవార్డుల వేడుకలో హల్‌చల్ చేసింది. రెడ్ కార్పెట్‌పై అమ్మడి గ్లామర్‌కి అంతా ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. అవార్డ్ ఫంక్షన్స్ అనగానే హాట్ అండ్ స్పైసీ లుక్స్‌తో అదరగొట్టేయడం అందాల భామలకి కొత్తేమీ కాదు. అయితే అలా అందాల విందు చేసినోళ్ళంతా 'టాక్ ఆఫ్ ది ఈవెంట్'గా మారలేరు. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి అతి కొద్దిమందిలో ఈషా రెబ్బా పేరు కూడా విన్పిస్తుందంటే దానికి కారణం, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అని చెప్పక తప్పదేమో. ట్రెడిషనల్ లుక్‌తోనూ మోడ్రన్ వేర్‌లో హల్‌చల్ చేయగలగడం ఈషా రెబ్బాలో అదనపు క్వాలిటీ. తెలుగులో పలు సినిమాలతో బిజీగా వుందిప్పుడు ఈ బ్యూటీ. ముంబై ముద్దుగుమ్మలకి ఏమాత్రం తీసిపోని ఈ పదహారణాల తెలుగమ్మాయ్, అవసరమైతే వెండితెరపై హీటెక్కించేలా సోయగాల్నీ ఆరబోసేయగలదు.