గ్లామ్‌షాట్‌: గీత దాటిన తెలుగందం బ్రాండ్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరమన్న అపవాదు ఎప్పుడో తొలిగిపోయింది. ఇప్పుడొస్తున్న ముద్దుగుమ్మలు కొంచెం కొంచెంగా ఆ అనుమానాల్ని పూర్తిగా పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అచ్చ తెలుగు తెలంగాణా బ్యూటీ ఈషారెబ్బ మాత్రం ఇంతవరకూ హద్దులు మీరని గ్లామర్‌తోనే ఆకట్టుకుంది.

 

కాకపోతే, తాజాగా సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ కుర్రకారుకు చిన్న షాకిచ్చింది. బ్లాక్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేసి తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని బయట పెట్టింది. యాష్‌ కలర్‌ టైట్‌ జీన్స్‌ బోటమ్‌తోనూ హీటు పుట్టించింది. అమాయకంగా చూస్తూ అవగా అందాల ఆరబోతకు తెర లేపిన ఈషా రెబ్బ ఈ లేటెస్ట్‌ పిక్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టాలెంట్‌ ఉన్నా, ఆచి తూచి సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్న ఈషా రెబ్బ సడెన్‌గా ఎందుకింత గ్లామర్‌ ఒలకబోసిందో తెలసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనట. బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఏదో ఇస్తానంటోంది ఫ్యాన్స్‌కి. అంటే బిగ్‌ ఆఫర్‌ ఏదో కొట్టేసినట్లుంది అందాల ఈషా.

 

ఆల్రెడీ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోతో 'అరవింద సమేత..' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో కొత్త ప్రాజెక్టులేమీ లేవు కానీ, అమ్మడి కాన్ఫిడెన్స్‌ చూస్తుంటే, ఏదో పెద్ద ప్రాజెక్టుకే సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS