తెలుగమ్మాయిపై ఓ లుక్కేసుకోండి.!

మరిన్ని వార్తలు

వరుసగా సినిమా ఆఫర్లు వచ్చేయకపోయినా, అడపా దడపా మంచి అవకాశాలే దక్కించుకుంటోంది తెలుగమ్మాయ్‌ ఇషా రెబ్బా. అయితే, తెలుగులో ఆమెకు నిఖార్సయిన హిట్‌ మాత్రం ఇంకా దొరకలేదు. 

తాజాగా ఇషా రెబ్బా 'సుబ్రహ్మణ్యపురం' సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. సుమంత్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. ఇటీవలే 'అరవింద సమేత' సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో ఇషా రెబ్బా కన్పించింది. ఆ తర్వాత నుంచే ఇషా సోషల్‌ మీడియాలో మరింత జోరు పెంచింది. ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోస్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఈ తెలుగమ్మాయ్‌.. ఆ హాట్‌ అప్పీల్‌తో బోల్డంతమంది అభిమానుల్నీ సంపాదించుకుంటోంది. 

అభిమానులకి చేరువవడానికే కాదు, అలా పెంచుకున్న ఫాలోయింగ్‌ అవకాశాల్నీ తెచ్చిపెడ్తుందని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. ఒక్కటంటే ఒక్క ఛాన్స్‌.. సరైనది దొరికితే, ఇషా రెబ్బా రేంజ్‌ పెరిగిపోతుంది. అయితే తెలుగులో తెలుగమ్మాయిలు స్టార్‌డమ్‌ సంపాదించుకోవడం అంత తేలిక కాదు. 'కలర్స్‌' స్వాతికి హిట్టొచ్చినా, ఆ తర్వాత ఆమెకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ అవకాశాలు, సక్సెస్‌లు వచ్చాయి. రీతూ వర్మ కూడా అంతే. శ్రీదివ్య, వేద అలియాస్‌ అర్చన, బిందు మాధవి.. వీళ్ళందర్నీ పొరుగు సినీ పరిశ్రమలే ఆదుకున్నాయి. ఈషా రెబ్బా మాత్రం, తెలుగులోనే సత్తా చాటాలనే కసితో వుంది. 

మన తెలుగమ్మాయ్‌ కదా.. మంచి అవకాశాలిస్తే, సత్తా చాటేస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ కోణంలో పెద్ద నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తే బావుంటుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS