#RRR లో ఈషారెబ్బాకి ఛాన్స్ వ‌చ్చిందా..?

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి మల్టీస్టార‌ర్‌  #RRR  షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఎన్టీఆర్ - రామ్‌చ‌ర‌ణ్ మిన‌హాయిస్తే... ఈ సినిమాలో క‌నిపించే మిగిలిన తారాగ‌ణం ఎవ‌ర‌న్న విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో ముగ్గురు క‌థానాయిక‌లుంటార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వాళ్ల పేర్లు కూడా చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌లేదు. అయితే కొన్ని పేర్లు మాత్రం బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్రియ‌మ‌ణి ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఇప్పుడు ఈషారెబ్బా పేరు కూడా వినిపిస్తోంది. #RRR లో ఈషారెబ్బాకి ఓ పాత్ర ద‌క్కింద‌ని స‌మాచారం. `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`లోనూ ఈషా మెరిసింది. అలానే ప్రాధాన్యం ఉన్న మ‌రో పాత్ర‌లో ఈషా న‌టించ‌నున్న‌దని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటిపై ఈషా కూడా స్పందించింది ''ఆర్‌.ఆర్‌.ఆర్‌లో అవ‌కాశం రావ‌డం కంటే.. గొప్ప అదృష్టం ఉంటుందా?  ఈ వార్త నేనూ విన్నాను. కానీ నా వ‌ర‌కూ రాలేదు. వ‌స్తే త‌ప్ప‌కుండా చెబుతా'' అని క్లారిటీ ఇచ్చింది.

మ‌రోవైపు 'ఎన్టీఆర్' బ‌యోపిక్‌లోనూ ఈ తెలుగ‌మ్మాయికి చోటు ద‌క్కిందిని టాక్‌. ఈ విష‌యంలో మాత్రం క్లారిటీగా స‌మాధానం చెప్ప‌లేదు. ''ఆ విష‌యం నేనే చెబితే బాగోదు. చిత్ర‌బృంద‌మే ప్ర‌క‌టించాలి'' అంటోంది. ఈషా మాట‌ల్ని బ‌ట్టి చూస్తే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఈషాకి ఛాన్స్ ద‌క్కిన‌ట్టే అనిపిస్తోంది. మ‌రి తాను ఎవ‌రి పాత్ర‌లో క‌నిపిస్తుందో చూడాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS