కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో వాయిదా పడిన మరో సినిమా `ఏక్ మినీ కథ`. ఏప్రిల్ 30న రావల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది. అమేజాన్ ప్రైమ్ లో ఈనెల 27న విడుదల అవుతోంది. సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ జంటగా నటించారు. శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించింది. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు.
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై 'ఏక్ మినీ కథ' సినిమాని నిర్మించారు. అమేజాన్ ఈ సినిమాకి ఏకంగా 2.5 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. 2.5 కోట్లంటే మంచి రేటే. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లలోపే అని టాక్. ఓటీటీతో పాటుగా శాటిలైట్ రేటు కూడా బాగానే గిట్టుబాటు అయ్యే ఛాన్సుంది. ఎలా చూసుకున్నా కనీసం 1.5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కడం ఖాయం. మినీ కథకు ఇది మెనీ ప్రాఫిటే అనుకోవాలి.