సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ పెహ్లాజ్ నేహ్లాని ని తప్పించడంలో ప్రముఖ హిందీ నిర్మాత అయిన ఏక్తా కపూర్ హస్తం ఉందంటూ బాలీవుడ్ వర్గాల్లో ఒకవార్త చక్కర్లు కొడుతున్నది.
అయితే ఈ విషయమై ఏక్తా కపూర్ స్పందిస్తూ- సెన్సార్ బోర్డు చీఫ్ ని మార్చే అధికారం సంబధిత మంత్రికి ఉంటుంది తప్ప తనకి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంచేసింది. ఈ వార్తల వెనుక అసలు కారణమేంటంటే- I&B మంత్రి అయిన స్మ్రితికి ఏక్తాకి మధ్య ఉన్న స్నేహం వల్లనే ఇటువంటి వార్తలు వస్తున్నాయి అని సమాచారం.
ఇక సెన్సార్ చీఫ్ గా కొత్తగా నియమించిన ప్రసూన్ జోషి నియమాకాన్ని సమర్దిస్తునే పెహ్లాజ్ ని తీయడం వెనుక తన పేరు ఉందంటూ వస్తున్న వార్తల వల్ల తనకి వచ్చే ఇబ్బంది ఏమి లేదు అని చెప్పుకొచ్చింది.