తీవ్రవాది కాదు, దేశభక్తి అనే కాన్సెప్ట్‌తో మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్య్రం కోసం జరిగే పోరాటంలో యోధుల్ని దేశభక్తులుగా భావిస్తామని చెబుతూ, వారిని తీవ్రవాదులుగా భావిస్తే తానూ తీవ్రవాదినేనంటాడు మనోజ్ ఈ సినిమాలో. మహిళలపై అరాచకాలు, అకృత్యాల గురించీ సినిమాలో ప్రస్తావించారు. ఓ విద్యార్థి నాయకుడు, ఓ పోరాటయోధుడు ఇదీ 'ఒక్కడు మిగిలాడు' మెయిన్ థీమ్‌లోని మెయిన్ క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసిన తీరు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో రెండు రకాల గెటప్స్‌లో మనోజ్ కనిపిస్తున్నాడు. కాలేజ్ స్టూడెంట్‌గానూ, లెప్టినెంట్‌గానూ కనిపిస్తాడు మనోజ్. కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ కోసం మనోజ్ బరువు తగ్గాడు. అలాగే లెఫ్టినెంట్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగాడు. ఏదో చేయాలి, ప్రేక్షకులకి తన నుండి కొత్తగా ఏదో చూపించాలనే తపన ఉన్నవాడు మనోజ్. విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ఉంటాడు అందుకే. కథల ఎంపికలో మనోజ్ స్టైలే వేరు. సక్సెస్, ఫెయిల్యూర్‌తో తనకి సంబంధం లేదంటాడు. సమాజానికి ఓ మంచి సినిమా తన ద్వారా పరిచయం చేశానా? లేదా? అనేదే మనోజ్ ఎప్పుడూ ఆలోచిస్తూంటాడు. మొన్నీ మధ్యనే 'గుంటూరోడు' సినిమాతో వచ్చి ఫర్వాలేదనిపించాడు. ఈ సారి 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు మంచు మనోజ్.