బిగ్ బాస్ హౌస్ ఇంటి నుండి ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆరుగురు సభ్యులు వెళ్ళిపోగా ఈ షో ఇప్పుడు ఏడవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే దాదాపుగా మొదటిసారిగా ఎలిమినేట్ అయిపోయిన ఒక సభ్యుడు/సభ్యురాలు మరోసారి ఇంటిలోకి వచ్చే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పిస్తున్నారు.
దీనికి సంబంధించి ఇప్పుడే నాని నుండి ఒక ప్రకటన వెలువడింది. ఈ ప్రకటన ప్రకారం ఈ షో చూస్తున్న వీక్షకులు ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన ఆరుగురి నుండి ఒకరిని మళ్ళీ ఇంటిలోకి తమ ఓటింగ్ ద్వారా పంపే అవకాశం ఉంది.
దీనితో మరోసారి ఈ సీజన్ గెలిచే అవకాశం ఇంటి నుండి సభ్యులకి వచ్చినట్టయింది. అయితే ఇప్పుడు మాత్రం తమకి నచ్చిన సభ్యుడి కోసం ఓట్లు వేసి మరోసారి బిగ్ బాస్ ఇంటికి పంపించాల్సి ఉంటుంది.
మరి- సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భాను శ్రీ & తేజస్విలలో రెండోసారి ఇంటికి వచ్చేది ఎవరు అనేదాని పైన అందరికి ఆసక్తి నెలకొంది.