ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి ఎమోషనల్ సీన్ లీక్..!

మరిన్ని వార్తలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అరవింద సమేత చిత్రానికి అప్పుడే లీకుల తలనొప్పి మొదలైంది.

వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్-నాగబాబులు కలిసి ఉన్న ఒక ఎమోషనల్ సన్నివేశం తాలుకా ఒక ఫోటో ప్రస్తుతం లీక్ అయింది. ఆ ఫోటో పరిశీలిస్తే అది సినిమాలో చాలా కీలక సన్నివేశం అని మనకి అర్ధమవుతుంది. ఈ దసరాకి ఎలాగైనా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి శరవేగంగా షూటింగ్ జరుపుతున్న సమయంలో ఇలా లీకులు అవ్వడం దురదృష్టకరం.

ఈమధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఏమీ లేకుండా ఈ లీకుల బెడద ఉంటూనే ఉంది. దీనిని నివారించడానికి ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఈ లీకులని మాత్రం ఆపలేకపోతున్నారు.

ఇక 'అరవింద సమేత' చిత్రానికి సంబంధించి సినిమా పైన ఇప్పటికే మంచి బజ్ అయితే ఆడియన్స్ లో వచ్చింది, త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో ఉన్నట్టుగా సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS