రామ్ చ‌ర‌ణ్ కోసం బాలీవుడ్ సెక్సీ బాంబ్‌!

By iQlikMovies - December 13, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

దేవిశ్రీ ప్ర‌సాద్ అన‌గానే ఐటెమ్ పాట గుర్తొస్తుంది. త‌న ఆల్బ‌మ్‌లో ఆరు పాట‌లుంటే.. అందులో  ఒక్క‌టైనా ప్ర‌త్యేక గీతం ఉండేలా చూసుకుంటాడు. అవి... మాస్‌ని కుదిపేస్తుంటాయి. ఆ పాట‌ల్ని తెర‌పై ఎంత బాగా తీసుకొస్తామ‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల అభిరుచిని బ‌ట్టి ఉంటుంది. `రంగ‌స్థ‌లం` కోసం సుకుమార్‌.. పూజా హెగ్డేని తీసుకొచ్చాడు. `జిగేలు రాణి`గా  పూజా కూడా మెప్పించింది. ఇప్పుడు బోయ‌పాటి శ్రీ‌ను వంతు వ‌చ్చింది.

రామ్ చ‌ర‌ణ్ - బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో `విన‌య విధేయ రామ‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఓ ప్ర‌త్యేక గీతం ఉంది. అందుకోసం.. చాలా మంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించింది చిత్ర‌బృందం. చివ‌ర‌కు బాలీవుడ్ సోయం.. ఈషా గుప్తాపై క‌న్ను ప‌డింది.

జ‌న్న‌త్ 2, బేబీ, రాజ్ 3 లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది ఈషా.  సెక్సీబాంబ్‌గా పేరు తెచ్చుకున్న ఈ ఢిల్లీ భామ‌.. ఇప్పుడు విన‌య విధేయ రామ కోసం రామ్‌చ‌ర‌ణ్‌తో ఆడి పాడే ఛాన్స్ అందుకుంది. ఈనెల 16 నుంచి హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ పాట‌ని 4 రోజుల పాటు తెర‌కెక్కిస్తారు. ఇషా గుప్తా న‌టించే తొలి ద‌క్షిణాది చిత్ర‌మిదే కావ‌డం విశేషం.  కైరా అడ్వాని క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి డివివి దాన‌య్య నిర్మాత‌. ఈ సంక్రాంతికి విడుద‌ల చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS