'ఎన్టీఆర్' ట్రైలర్ & ఆడియో లాంచ్ డిటైల్స్

By iQlikMovies - December 12, 2018 - 19:09 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో... ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.. 21న ఆడియో వేడుక భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

ఇందులో నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. వ‌చ్చిన ప్ర‌తీ లుక్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా వ‌స్తుంది.

జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS