గ్లామ్‌షాట్‌: కొంటె చూపులు విసిరి, కైపెక్కించేసి!

మరిన్ని వార్తలు

'ఏక్‌బార్‌ ఏక్‌ బార్‌..' అంటూ రామ్‌ చరణ్‌ పక్కన 'వినయ విధేయ రామ' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ఈషా గుప్తా. నిజానికి ఈ భామ ఎప్పుడో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే, అది బైలింగ్వల్‌ మూవీ. తమిళ, తెలుగు భాషల్లో రూపొందింది. సచిన్‌ జోషి హీరోగా తెరకెక్కిన 'వీడెవడు' సినిమాలో ఈషా హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాని పెద్దగా పట్టించుకోలేదనుకోండి. దురదృష్టవశాత్తూ రామ్‌చరణ్‌ 'వీవీఆర్‌' కూడా సక్సెస్‌ కాలేదీ బ్యూటీకి. దాంతో, పాప మత్తు మత్తు అందాలు చిత్తు కాగితాల్లో కలిసిపోయాయి. అయినా అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన అందాలకు పదును పెడుతూ ఉంటుంది హాట్‌ హాట్‌ ఈషా గుప్తా.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

📸 @tushar.b.official

A post shared by Esha Gupta🌎 (@egupta) on

తాజాగా ఈషా ఓ ఫోటో సెషన్‌ చేయించుకుంది. మరీ హాట్‌ అప్పీల్‌ అని చెప్పలేం కానీ, థై హాట్‌నెస్‌తో కైపెక్కించే ప్రయత్నం చేస్తోంది. డిఫరెంట్‌ హెయిర్‌ కట్‌తో వైట్‌ అండ్‌ బ్లూ కాంబినేషన్‌లో ఓ మోడ్రన్‌ టాప్‌ ధరించి నేలపై కూర్చొంది. ఈ టాప్‌ మరీ షార్ట్‌గా ఉండడంతో, థై సోయగాలు వెల్లువలా బయటపడుతున్నాయి. కాళ్లకు వేసిన కాంట్రాస్ట్‌ రెడ్‌ కలర్‌ గమ్‌ బూట్స్‌ ఈ పిక్‌కి ప్రధాన ఆకర్షణ అవుతున్నాయి. ఇక నెయిల్స్‌కి వేసిన డార్క్‌ చాక్లెట్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ కూడా బాగా ఎలివేట్‌ అవుతూ మత్తు మత్తుగా కైపెక్కిస్తోంది. ప్రస్తుతం ఈషా హిందీలో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS