బాలయ్య నూట ఆరవ చిత్రానికి బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకి మొదట్నుంచీ రూమర్లు వెంటాడుతున్నాయి. బడ్జెట్ దగ్గర నుండి, రెమ్యునరేషన్ విషయం వరకూ అన్నీ రూమర్సే. అయితే, రూమర్స్ సహజమే. కానీ, ఎందుకో ఈ సారి రూమర్స్ బాలయ్య సినిమాకి అడ్డంకిగా మారాయి. అసలే బాలయ్య ఇమేజ్ దారుణంగా పడిపోతూ వస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఘనంగా రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి.
రీసెంట్‌గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'రూలర్' కూడా అదే పరిస్థితి. కనీసం షేర్ సాధించలేదు సరికదా.. తొలి రోజుకే రివర్స్ గేర్ వేసేసింది. దాంతో బోయపాటి శీనుతో సినిమా హోల్డ్‌లో పడిందని ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఆల్రెడీ రెండు బంపర్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. హ్యాట్రిక్ మూవీగా రూపొందుతోన్న ఈ కాంబో మూవీకి ఆదిలోనే.. ఏదో అన్నట్లుగా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రూమర్లు వెంటాడుతున్నాయి. అయితే, ఎవరి మాటా వినడు బాలయ్యా.. తాను అనుకున్నదే చేస్తాడు. ఎలాగైనా సినిమాని పట్టాలెక్కించినా ఎక్కేస్తాడు.
బాలయ్య సంగతి సరే, బోయపాటి సంగతేంటీ? ఒక్క ఫ్లాప్‌తో బోయపాటి గ్రాఫ్ పడిపోయింది. ఈ ఏడాది 'వినయ విధేయ రామ' రూపంలో బోయపాటి కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ ఉంది. సో బోయపాటి తానేంటో ప్రూవ్ చేసుకోవాలంటే, బాలయ్య సినిమాని తెరకెక్కించడమే కాదు, సూపర్ హిట్ కొట్టి సత్తా చాటాలి. ఏం జరుగుతుందో చూద్దాం.