అసలు సిసలు తెలుగమ్మాయి ఈషా రెబ్బ కాస్త దూకుడు తగ్గించింది. హీరోయిన్గా సినిమాలు చేస్తూనే, ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. కానీ, కెరీర్‌కి అవేమంత యూజ్ అయినట్లు కనబడలేదు. రేస్‌లో బాగా వెనక్కి తగ్గింది. యాక్టింగ్ టాలెంట్ ప్రకారం అమ్మడు టాప్ అని తేలిపోయింది. ఇక గ్లామర్ విషయంలోనూ ఏమంత తక్కువ కాదని నిరూపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ, అమ్మడు కోరుకున్న అవకాశాలు, సక్సెస్‌లు మాత్రం దక్కడం లేదు. ఇక సోషల్ మీడియలో అప్పుడప్పుడూ మెరుపతీగలా మెరిసే ఈషారెబ్బ తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసింది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించింది. ఒక సైడ్ ఫుల్‌గానే కవర్ చేసింది. కానీ, ఇంకో సైడ్ ఆఫ్ షోల్డర్ ఎక్స్పోజ్ చేసింది. లోపల గ్రే కలర్ ఇన్నర్ వేర్ ధరించింది. స్లీవ్‌లెస్ కానీ, ఫుల్ లెంగ్త్‌లోనే ఉందిలెండి. మరీ కళాపోషకులు ఊహించినంత గ్లామర్ కాకపోయినా, ఓ మోస్తరు హాట్ అప్పీల్ ఇస్తోంది ఈ పోజులో. లూజ్ హెయిర్‌తో స్టైలిష్ పోజిచ్చి నిలుచుంది 'కామెంట్ ప్లీజ్' అన్నట్లుగా.. నచ్చితే కామెంట్ చేసుకోండి. ఇక ఈ తెలంగాణా పోరి ప్రస్తుతం 'రాగల 24 గంటల్లో' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.