భరత్ అనే నేనులో ఈవ్ టీజింగ్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కెరీర్ లోనే ఈచిత్రం అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా మిగిలిపోనుంది.

అయితే ఈ చిత్రంలో కొన్ని మంచి సన్నివేశాలు ఫైనల్ కట్ లో పెట్టలేకపోయాము అని హీరో-దర్శకుడు చెబుతుండడం చూస్తున్నాము. అలాంటి ఒక సన్నివేశం గురించే ఈ వార్త-  ఎడిట్ చేసేసిన మంచి సన్నివేశాల్లో ఈవ్ టీజింగ్ గురించిన సన్నివేశం ఒకటి ఉందని అది చాలా చక్కటి సన్నివేశం అని మహేష్ చెప్పుకొచ్చాడు. 

కొంతమంది అమ్మాయిలని ఏడిపించే ఒక ఈవ్ టీజర్ ని పట్టుకొని మహేష్ దగ్గరికి తీసుకొచ్చాక హీరో అతగాడికి ఏ పద్దతిలో నచ్చజెప్పారు అనేది ఆ సన్నివేశంలో ఉంటుందట.అయితే ఈ సన్నివేశం కూడా చిత్ర నిడివికి ఇబ్బందిగా ఉండటంతో దానిని తోలిగించినట్టు తెలిపారు.

 

ఇప్పటికే హోలీ ఫైట్ సన్నివేశం కూడా తీసేసినట్టు దర్శకుడు ఒప్పుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS