ఎవ్లీన్ శర్మ ఈ పేరుకు కాస్త పరిచయం అవసరమండి. త్వరలోనే తెలుగు ప్రేక్షకులకు 'సాహో' సినిమా ద్వారా పరిచయం కానుంది ఈ ముద్దుగుమ్మ. జర్మన్ మోడల్‌గా పాపులర్ అయిన ఈ అందాల భామ బాలీవుడ్లో కొద్ది సినిమాలతో పరిచయం. ఓ పంజాబీ సినిమాలో స్పెషల్ రోల్ కూడా పోషించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో 'సాహో'తోనే తెరంగేట్రం చేసింది. ఈ సినిమా తనకు టర్నింగ్ పాయింట్ అంటోంది. నిడివి తక్కువే అయినా గుర్తుండిపోయే పాత్రట 'సాహో'లో ఎవ్లిన్ శర్మది.
అవకాశాలు వస్తే, మరిన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమంటోంది. అందరికీ గుర్తుండిపోవాలంటే, సినిమాలే కాదు, స్పెషల్ యాక్టివిటీస్ కూడా చేయాలి కదా. వాటిలో ముఖ్యంగా ముద్దుగుమ్మలు చేసే యాక్టివిటీ అందాల ఆరబోత. అందుకే వేదిక సోషల్ మీడియా. ఆ వేదికపై అప్పుడప్పుడూ అలా అలా అందాలారబోయకపోతే, కళాపోషకుల కంటికి పనే ఉండదు కదా. అందుకే ఇదిగో తాజాగా ఎవ్లిన్ శర్మ ఆరేసిన అందాల వడ్డన మీరూ చూసేయండి. స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో క్లోజప్‌లో పోజిచ్చి ఎలా మురిసిపోతుందో.