టాలీవుడ్ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే నెలలో విడుదలకు సిద్దమయ్యాయి. రాధేశ్యామ్, ట్రిపులార్. కేవలం పదిహేను రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు ముందు రావడంతో రాధేశ్యామ్ వెర్సస్ ట్రిపులార్ హంగామా వుంటుందని అభిమానులు లెక్కలు వేసుకున్నారు. అయితే రాధేశ్యామ్ చప్పపడిపోయింది. మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ మూటకట్టుకున్న ఈ సినిమా, ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అద్భుతమైన ప్రేమ కథ , క్లాసిక్ మేకింగ్ అని కొందరు మాట్లాడినా లాభం లేకపోయింది. అతిపెద్ద డిజాస్టర్ అని బాక్సాఫీసు లెక్కలు తెల్చేశాయి.
సాహోకి నెగిటివ్ టాక్ వచ్చినా నార్త్ లో మంచిగానే వసుళ్ళూ రాబట్టింది. కానీ రాధేశ్యామ్ ని అక్కడి జనాలు ఆదరించలేదు. ఇప్పుడు ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ పైనే వున్నాయి. ఆర్ఆర్ఆర్ రాజమౌళి బ్రాండ్ పై ప్రమోట్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్, తారక్ ,.. ఇప్పటికీ వరకూ ఒక్క పాన్ఇండియా సినిమా కూడా చేయలేదు. చరణ్ తుపాన్ సినిమాతో బాలీవుడ్ లో ఓ ప్రయత్నం చేసినప్పటికీ అదీ అపజయమే. ఇప్పుడు అందరి ఆశలు రాజమౌళిపైనే వున్నాయి. బాహుబలితో వండర్ చేసిన రాజమౌళి.. మరోసారి తెలుగు సినిమా స్టామినా పాన్ ఇండియా చాటుతాడని నమ్మకంగా వున్నారు అభిమానులు.