మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న 'ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్'కి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్ని చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సినిమా నిర్మాణం తుది అంకానికి చేరుకుంది అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి స్పందిస్తూ 'ఎఫ్ 2' డైరెక్టర్ అనిల్ రావిపూడి రేపట్నుంచి 'ఫన్ స్టార్ట్స్' అని ట్వీట్ చేశాడు. మొత్తానికి రేపట్నుంచి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ స్టార్ట్ అయిపోనుందని తెలుస్తోంది. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటు, మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేయనున్నారట. అందుకు రేపట్నుంచే ముహూర్తం ఖరారు చేశారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో ఇటీవల దిల్‌రాజు బాగా నష్టపోయారు. ఇప్పుడు రాబోయే ఈ 'ఎఫ్ 2' పైనే ఆయన ఆశలన్నీ. దిల్‌రాజు లెక్కేశారంటే ఆ లెక్క అస్సలు తప్పదు. కానీ ఈ మధ్య ఆయన లెక్కలు తారుమారవుతూ వస్తున్నాయి. దిల్‌రాజు చెయ్యి పడిందంటే చాలు ఆ సినిమాకి సక్సెస్ పక్కా అనే ముద్ర ఉంది.
కానీ ఈ మధ్య ఆశించిన సక్సెస్‌లు దిల్‌రాజు ఖాతాలో పడలేదు. 'ఎఫ్ 2'తో దిల్‌రాజు సక్సెస్ అకౌంట్ మళ్లీ తెరుస్తారని అంచనా వేస్తున్నారు. రేపట్నుంచి అద్దిరిపోయేలా 'ఎఫ్ 2' ప్రమోషన్స్‌ని ప్లాన్ చేశారట. మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారీ సినిమాలో.