600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'రోబో 2.0'. మేకింగ్‌తో పాటు, బడ్జెట్ పరంగానూ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ అంచనాల్ని రోబో అందుకుంది. ఇక ఇప్పుడు 'ఇండియన్ 2' టైం స్టార్ట్ అయ్యింది. అదే శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో విజువల్ వండర్స్ ఏమీ ఉండవు. కానీ అదిరిపోయే స్క్రీన్‌ప్లే, కథా కథనాల్లోని బలం ఈ సినిమా స్పెషాలిటీ. అందుకే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అని భావిస్తున్నారట. ఖచ్చితగా ఆ ఫిగర్ ఎంతా.? అంటే అక్షరాలా వెయ్యి కోట్లట.
వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రంగా 'ఇండియన్ 2' నిలిచిపోనుందట. విశ్వనటుడు కమల్‌హాసన్‌కి ఉన్న పాపులారిటీ దృష్ట్యా, శంకర్ సినిమా '2.0'కి వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా 'ఇండియన్ 2'కి ఆ బడ్జెట్ వర్కవుట్ అయిపోద్ది అని చిత్ర నిర్మాతలు ఈ అరుదైన నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారమ్. 'రోబో 2.0'ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందుతోంది. చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
శంకర్ సినిమాల్లో కామన్‌గా ఉండే పాయింట్, మేకప్‌కి ఈ సినిమాలోనూ అత్యంత ప్రాధాన్యత ఉందట. ముఖ్యంగా కమల్‌హాసన్ తండ్రి సేనాపతి పాత్ర మొదటి పార్ట్‌కి మించి పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయనున్నారనీ తెలుస్తోంది. ఈ నెల 14 నుండే 'ఇండియన్ 2' చిత్రీకరణ ప్రారంభం కానుంది. '2.0'ని మించిన అంచనాలు ఈ సినిమాపై అప్పుడే క్రియేట్ అయిపోయాయి.