ఎఫ్‌ 2 'కితకితలు' టైం స్టార్ట్స్‌ నౌ.!

By iQlikMovies - January 12, 2019 - 11:03 AM IST

మరిన్ని వార్తలు

ఎఫ్‌ 2 'కితకితలు' 

 

వరుణ్‌తేజ్‌, వెంకటేష్‌ మల్టీ స్టారర్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'ఎఫ్‌ 2'. సంక్రాంతికి అసలు సిసలు ఎంటర్‌టైనింగ్‌ మూవీగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనిల్‌ రావిపూడి సినిమాలంటే ఎక్కువగా కామెడీనే ఎక్స్‌పెక్ట్‌ చేస్తుంటారు. ఆ డోస్‌ ఈ సారి ఈ సినిమాలో రెండింతలు కాదు, మూడింతలు కానుంది. వెంకీ కామెడీ టైమింగ్‌ తెలిసిందే. అలాగే వరుణ్‌లో కూడా ఇంత కమెడియన్‌ దాగున్నాడా.? అని ఆశ్చర్యపోక తప్పదంట ఈ సినిమా చూశాక.

 

వరుణ్‌ యాదవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపించనున్నాడు. పక్కా తెలంగాణా యాసలో మాట్లాడుతూ ఈ పాత్ర పండిస్తున్న కామెడీ క్లిప్పింగ్స్‌ ఆల్రెడీ శాంపిల్‌కి చూసేశాం. ఇక సినిమా చూస్తే ఫుల్‌ డోస్‌ అందేయడం ఖాయం. ఇక సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. కామెడీనే కాదు, సీరియస్‌ మోడ్‌నీ చూపించగలరు.

 

అయితే ఈ సినిమాలో ఎక్కడా సీరియస్‌నెస్‌కి చోటివ్వకుండా, ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించాడు అనిల్‌ రావిపూడి. ఆడియన్స్‌ని అస్సలు సీట్లో కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తుందట. అయ్యో పొరపడకండి. అంటే కామెడీ కితకితలు ఆ రేంజ్‌లో ఉంటాయట. ఇంకెందుకాలస్యం ఇప్పుడే ధియేటర్‌కి వెళ్లి ఆ కితకితల్ని మీరు కూడా ఎంజాయ్‌ చేసేయండి మరి. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS