శుక్రవారం విడుదలైన `ఎఫ్ 3` కి మంచి స్పందనే వచ్చింది. రివ్యూలు పాజిటీవ్ గా రావడం, టికెట్ రేట్లు తగ్గడం, టీజర్ - ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఎఫ్ 3పై జనాలు దృష్టి పెట్టారు. శుక్రవారం నాటి వసూళ్ల జోరు, శని, ఆదివారాలూ కనిపించింది. వీకెండ్ ని ఎఫ్ 3 బాగా క్యాష్ చేసుకోవడంతో తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా వసూళ్లు కూడా లెక్కేస్తే మరో రూ.5 కోట్లు పెరుగుతుంది. అంటే. 33 కోట్ల రూపాయలన్నమాట. ప్రపంచ వ్యాప్తంగా రూ,.70 కోట్ల బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో 37 కోట్లు దక్కించుకోవాలి.
ఏరియాల వారిగా.. వసూళ్లు
నైజాం: రూ.12 కోట్లు
సీడెడ్: రూ.3.65 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.3.33
గుంటూరు: రూ.2.08 కోట్లు
ఈస్ట్: రూ.1.82 కోట్లు
వెస్ట్: రూ.1.54 కోట్లు
కృష్ణ: 1.77 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి రూ.27 కోట్లు