అడవిశేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం `మేజర్`. జూన్ 3న వస్తోంది. అయితే పది రోజుల ముందుగానే ప్రీమియర్లు మొదలెట్టేశారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రధానమైన నగరాల్లో ప్రీమియర్ షోల హడావుడి మొదలైపోయింది. లేటెస్టుగా విశాఖపట్నంలోనూ ఓ స్పెషల్ షో వేశారు. పది రోజుల ముందు గానే సినిమా చూపించేయడం నిజంగానే ఓ సాహసోపేతమైన నిర్ణయం. సినిమా ఏమాత్రం బ్యాడ్ గా ఉన్నా ఆ టాక్ బయటకు వచ్చేస్తుంది. అది సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే అదృష్టం కొద్దీ మేజర్‌కి `సూపర్ హిట్` టాక్ వచ్చింది. ఈ సినిమా ఉద్వేగభరితంగా ఉందని, ప్రతీ భారతీయుడూ చూడాల్సిన సినిమా అని, ముఖ్యంగా చివరి 40 నిమిషాలూ.. కంటతడి పెట్టించే ఎమోషన్‌తో సాగిందంటూ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఇంత మంచి టాక్ రావడం.. నిజంగా పాజిటీవ్ విషయం. ఈ సినిమా ఓపెనింగ్స్ కి సైతం... ఈ టాక్ బాగా ఉపయోగడుతుంది.
''పది రోజుల ముందే ప్రీమియర్లు ప్రదర్శించడం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి జరిగింది. సినిమాపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఇప్పుడు నిజంగా అది మంచి ఫలితాల్ని ఇస్తోంది. షోలు వేసిన ప్రతీచోటా.. గొప్ప స్పందన వచ్చింది. ఆ స్పందన మాకెంతో ధైర్యాన్ని అందించింది. ఈ టాక్... థియేటర్లకు జనాల్ని తీసుకురావడం గ్యారెంటీ'' అని మేజర్ యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.