ఎఫ్ 3... ఈసారి రిస్కేనా?

మరిన్ని వార్తలు

సీక్వెల్ అంటే ప్రేక్ష‌కుల్లో చాలా అంచ‌నాలు ఉంటాయి. ముఖ్యంగా క‌థ‌, క‌థ‌నం,పాత్ర‌లు... వీటిపై ప్రేక్ష‌కుల‌కు అప్ప‌టికే ఓ అవ‌గాహ‌న ఉంటుంది. వాటికి విరుద్ధంగా ఏం జ‌రిగినా రిస్కే. ఇప్పుడు ఆ రిస్కే అనిల్ రావిపూడి తీసుకోబోతున్నాడు. అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా `ఎఫ్ 3.` ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్ అనుకుంటున్నారంతా. అయితే ఆ క‌థ‌కీ, ఈ క‌థ‌కీ ఏమాత్రం సంబంధం లేద‌ని, పాత్ర‌లు కూడా కాస్త తేడాగా క‌నిపించ‌బోతున్నాయ‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌.

 

ఎఫ్ 2లో... భార్యాబాధితుల్ని చూపించాడు అనిల్ రావిపూడి. ఆ పాయింట్.. ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. పైగా అందులోంచి కావ‌ల్సినంత కామెడీ పండింది. అయితే ఈసారి కూడా అదే చూపిస్తే కుద‌ర‌దు క‌దా. అందుకే భ‌ర్త‌ల వ‌ల్ల బాధ‌ప‌డే భార్య‌ల్ని చూపించ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు... వెంకీ, వ‌రుణ్‌ల పాత్ర‌ల్ని పూర్తిగా మార్చేశాడ‌ట‌. వెంకీకి రేచీక‌టి, వ‌రుణ్‌కి న‌త్తి.. ఇలా ఒక్కో పాత్ర‌కు ఒక్కో లోపం పెట్టి, అందులోంచి వినోడం పుట్టించ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. అలా.. ఎఫ్ 2 క‌థ‌ని పూర్తిగా మార్చేశాడ‌ని టాక్‌. ఇందులో ఓ ప్ల‌స్ ఉంది. ఓ మైన‌స్ ఉంది. పూర్తిగా కొత్త క‌థ చూసి ప్రేక్ష‌కులు థ్రిల్ అవ్వ‌డం ప్ల‌స్ పాయింటే. అయితే ఏదో ఊహించుకుని ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్తే.. ఇంకేదో చూపిస్తే.. ఫ‌లితం తేడా కొట్టే ప్ర‌మాదం కూడా ఉంది. మ‌రి.. ఈ రెండింటిలో ఎఫ్ 3 దేనివైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS