ఓటీటీనా? థియేటర్లా? అని నిర్మాతలు ఊగిసలాడుతున్నారు. థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసి, రిస్క్ తీసుకోలేని వాళ్లు ఓటీటీనే మేలనుకుంటుంటే, సినిమా బాగుంటే, జనాలు వస్తారన్న నమ్మకంతో కొంతమంది థియేటర్ల బాట పడుతున్నారు. టక్ జగదీష్ లాంటి క్రేజీ సినిమాలు సైతం ఓటీటీలోకి వచ్చేస్తుంటే, ఆ తరహా సినిమాలన్నీ ఓటీటీలకు వెళ్లిపోతాయన్న రూమర్లు బాగా పెరిగిపోయాయి. విరాటపర్వం, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఇవన్నీ ఓటీటీలకు వెళ్లిపోతాయన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారానికి లవ్ స్టోరీ పుల్ స్టాప్ పెట్టబోతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారు. సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్సయ్యారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా శేఖర్ కమ్ముల సినిమాల్ని ఇష్టపడతారు. వాళ్లని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాబట్టి.. థియేటర్లలోనే విడుదల చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యింది చిత్రబృందం. పైగా... సారంగ దరియా పాట యూ ట్యూబ్ లోని అన్ని రికార్డుల్నీ తుడిచేస్తోంది. ఆ పాటకోసమైనా జనాలు థియేటర్లకు వస్తారన్నది నిర్మాత నమ్మకం. సో.. లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ లేనట్టే.