ఇది ఫేక్ ఫోటో: క్లారిటీ ఇచ్చిన నాని!

మరిన్ని వార్తలు

సోషల్ మీడియా వల్ల newsense తో పాటు nonsense కూడా పెరిగిపోయింది – కాదంటారా?

ఇంక సెలబ్రిటీస్ కి అయితే announcements తో పాటు clarifications కూడా ఎక్కువైపోయాయి. ఎవరో ఎందుకు, మన నాని-అంజన దంపతులకి మొన్న ఉగాది రోజున పండంటి మగపిల్లాడు జన్మించాడు. ఇంకా పూర్తిగా ఆ ఆనందం నుండి బైటికొచ్చి జూనియర్ natural స్టార్ ని ప్రపంచానికి పరిచయం చేసేలోపే నాని ఒక చిన్న పాప తో దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయం నాని దాకా వెళ్ళింది బాసు. అందుకే ఇంక ఆలస్యం చేయకుండా దీని మీద క్లారిటీ ఇచ్చాడు నాని. ఆ పిక్ తన తనయుడికి కాదని, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్ సమయం లో దిగిందని వివరణ ఇచ్చాడు. సంబంధం లేని ఫోటోలు ఇలా దుష్ప్రచారం చేయడం మానుకోవాలని నాని కోరాడు.

కావున ఔత్సాహికులు ఇకనైన ఈ ఫోటో ని వదిలేసి వేరే పనిలో నిమగ్మమయితే అందరికీ మంచిది!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS