వామ్మో.. ఏం అభిమానం.. రామ్, ఛార్మి షాకైపోయారు!

By iQlikMovies - July 09, 2019 - 19:30 PM IST

మరిన్ని వార్తలు

సినిమా అంటే పిచ్చి, వెర్రి.. అదోర‌క‌మైన అభిమానం. హీరో, హీరోయిన్‌, ద‌ర్శ‌కుడు... వీళ్లంటే ప‌డి చ‌స్తారు ఫ్యాన్స్‌. ఆఖ‌రికి గుళ్లు క‌ట్ట‌డానికి, మొక్కులు చెల్లించుకోవ‌డానికి కూడా వెనుకంజ వేయ‌రు. అలాంటి ఓ అభిమాని రామ్‌, ఛార్మిల‌కు కంట‌త‌డి పెట్టించేశాడు. ఆ అభిమానం చూసి... రామ్‌, ఛార్మి ఇద్ద‌రూ షాకైపోయారు. వివ‌రాల్లోకి వెళ్లే... రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని ప్రార్థిస్తూ సందీప్‌ అనే అభిమాని తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కాడు.

 

ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో వ‌దిలాడు. దాన్ని చూసి రామ్, ఛార్మి ఇద్ద‌రూ షాకైపోయారు. ‘ప్రియమైన సందీప్‌ నీ వీడియో చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది, బాధించింది, షాక్‌కు గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై కురిపించడానికి నేనేం చేశానో అర్థం కావడం లేదు. కానీ మీలాంటి వారి కోసం నా గుండెకొట్టుకుంటూనే ఉంటుంది.

 

నిజంగా నేను కృతజ్ఞుడ్ని’ అని ఓ పోస్ట్ చేశాడు రామ్‌. ఈ వీడియో చూసి ఛార్మి కూడా స్పందిచింది.‘నువ్వు నన్ను ఏడిపించావు సందీప్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బ్లాక్‌బస్టర్‌ కావాలని నీ మోకాలిపై తిరుమలకు వెళ్లిన నీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. నువ్వు మాపై ఎంతో ప్రేమ, అనురాగం చూపించావు’ అని ట్వీట్ చేసింది. మొత్తానికి ఛార్మి, రామ్‌ల అభిమానాన్ని, ప్రేమ‌ని సంపాదించుకోగ‌లిగాడు సందీప్‌. ఆ అభిమానం కోస‌మైనా ఇస్మార్ట్ శంకర్ ఆడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS