చాలా కాలం క్రిందట శ్రావణమాసం అనే సినిమాలో నటించారు హరికృష్ణ. అదే నటుడిగా ఆయనకు చివరి సినిమా. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించారు. అయినా ఇప్పటికీ సినీ పరిశ్రమతో ఆయనకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అరుదుగా కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ సినిమాల ఫంక్షన్స్‌లో కనిపిస్తూంటారు.
రాజకీయం విషయానికి వస్తే, గతంలో రాష్ట్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. కొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఆయన సొంతం. ఇదెలా సాధ్యం.? రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయారనగానే పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఆసుపత్రి ఎదురుగా అభిమానులు జనసంద్రాన్ని తలపించారు. ఆయన పార్ధివ దేహాన్ని హైద్రాబాద్ తరలిస్తే, కడసారి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు.
స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు కాబట్టే ఆయనకు ఇంత ఫాలోయింగ్ అనుకుంటే పొరపాటే. హరికృష్ణ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం. అందుకే అయనంటే ఇంత అభిమానమనీ, ప్రతీ ఒక్కరూ చెబుతున్నారు. గుప్త దానాలు చేయడంలోనూ పదిమందికి సాయపడ్డంలోనూ హరికృష్ణ వెరీ వెరీ స్పెషల్. అందుకే ఓ గొప్ప నాయకున్ని, అంతకంటే మించి, ఓ మంచి ఆత్మీయున్ని కోల్పోయామన్న బాధ అందరిలోనూ కనిపిస్తోంది.