నాలుగేళ్ళుగా ఎదురుచూస్తున్న ట్రిపులార్ ఎట్టకేలకు థియేటర్ లోకి వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు విందు భోజనం పెట్టి పంపించారు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలే. ఏసీ థియేటర్ లో కూడా చొక్కాలు తడిసిపోతున్నాయి, అంత వేడి రాజేశారు రాజమౌళి. సినిమా చూసిన ప్రేక్షకులది ఒకే మాట.. మైండ్ బ్లోయింగ్. అయితే ఒక చిన్న నిరాశ కూడా వుంది. ప్రభాస్ పెట్టుకొని రెండు పార్టులు గా బాహుబలి తీసిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరి హీరోలని పెట్టుకొని ఆర్ఆర్ఆర్ ని చివర్లో అంత ఫోర్స్ గా ఎందుకు క్లోజ్ చేశారని ఫీలౌతున్నారు ఫ్యాన్స్.
''చరణ్, ఎన్టీఆర్ ని చూడడానికి మూడు గంటలు సరిపోలేదు, మాకు ఇంకా కావాలి., రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ పార్ట్ 2తీయండి'' అని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి ఆర్ఆర్ఆర్ ఒక పార్ట్ గానే అనుకున్నారు రాజమౌళి. దీనికి పార్ట్ 2 అవకాశం కూడాపెద్దగా ఇవ్వలేదు. అయితే ఫ్యాన్స్ ఎమోషన్స్ కి లాజిక్కులు వుండవు. మూడు గంటల నిడివి కూడా వారికి సరిపోలేదంటే సినిమా ఎంత గ్రిప్పింగా వుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అభిమానులే కాదు చాలా మంది విమర్శకులు కూడా కథని హర్రీగా ముగించేశారని అభిప్రాయపడటం గమనార్హం.