బాలీవుడ్ లో కమల్ ఆర్ ఖాన్ అనే ఒక నిత్య విమర్శకుడు వున్నాడు. అతని నోటి నుంచి తిన్నగా ఒక్క మంచిమాట రాదు. తన జీవితంలో ఒక్క సినిమాని కూడా బావుందని మెచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ అతడికి పేస్ బుక్ బ్లూక్ టిక్ వుంది. వివాదాలు రేపుతుంటాడు కాబట్టి మీడియా అప్పుడప్పుడు అతడి మాటలతో ఫిల్లర్స్ వేస్తూ వుంటుంది. ఇప్పుడు కమల్ ద్రుష్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ పై పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ట్విట్టర్ రివ్యూ ఇచ్చాడు కమల్ ఆర్ ఖాన్. సినిమాని చెత్తతో పోల్చాడు.
రాజమౌళి అర్ధం పర్ధం లేని సినిమా తీశాడని, ఆయన్ని ఆరు నెలలు పాటు జైలు పట్టాలని అన్నాడు కమల్ భారతీయ సినీ చరిత్రలో ఇప్పటి వరకు తీయనటువంటి చెత్త సినిమా ఆర్ఆర్ఆర్ అంట, 600 కోట్ల రూపాయలతో ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆరు నెలలు జైలులో పెట్టాలని అతడి ఉవాచా. అయితే కమల్ మాటలని ఎవరూ సీరియస్ గా తీసుకోరనే పరిస్థితిలో లేరు. ఆర్ఆర్ఆర్ చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని రివ్యూలు ఇచ్చారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటేఏడాది బాలీవుడ్ హిట్ సినిమాల్లో పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది.