మహర్షి సినిమా ప్రమోషన్ల విషయంలో మహేష్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో కిక్ లేదు. టీజర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రమోషన్ల విషయంలోనూ చిత్రబృందం బద్దకంగా వ్యవహరిస్తుండడంతో ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ సినిమాకి ఏకంగా ముగ్గురు నిర్మాతలున్నారు. అంతా భారీదనాన్ని ఇష్టపడేవాళ్లే. అశ్వనీదత్, పీవీపీ తమ సినిమాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. దిల్ రాజు అయితే సరే సరి.
కానీ మహర్షి ప్రమోషన్లు డల్‌గా ఉన్నాయి. దీనంతటికీ కారణం దిల్‌రాజునే అన్నది టాలీవుడ్ టాక్. ప్రమోషన్ వ్యవహారాలు చూసుకోమని మిగిలిన ఇద్దరూ దిల్‌రాజుకి బాధ్యతలు అప్పగించారట. కానీ దిల్ రాజు మాత్రం తన సొంత సినిమాలపై పెట్టిన దృష్టి ఈ పార్టనర్ షిప్ సినిమాపై పెట్టలేదు. స్టార్ హీరోల సినిమాలకు ప్రమోషన్ అక్కరలేదని, సినిమాకి వద్దన్నా బజ్ వచ్చేస్తుందని దిల్ రాజు చెబుతూ వస్తున్నాడట. ఇప్పుడు ఈ సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్ చూసి బయ్యర్లకు భయం పట్టుకుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో అయినా ఈ సినిమాకి బజ్ వస్తే అంతే చాలు అనుకుంటున్నారు.
ఈరోజే ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. మరి అదెలా ఉంటుందో చూడాలి. ఇక నుంచైనా మహర్షి ప్రమోషన్ల జోరు పెంచకపోతే కష్టమే అన్నది సినీ జనాల మాట.