మరీ చెప్పుకోదగ్గ బిజీ కాకపోయినా, రకుల్ ప్రీత్‌సింగ్ ఇటు తమిళ, తెలుగు భాషల్లోనూ, అటు హిందీలోనూ కూడా బాగానే దున్నేస్తోంది. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్జీకే' చిత్రంలోనూ, హిందీలో అజయ్‌దేవగణ్ సరసన 'దే దే ప్యార్ దే' సినిమాలోనూ రకుల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లోనూ రకుల్ మెయిన్ హీరోయిన్ కాదు. రకుల్‌కి పోటీగా మరో ముద్దుగుమ్మలు ఆయా సినిమాల్లో నటిస్తున్నారు. తమిళ సినిమా 'ఎన్జీకే' విషయానికి వస్తే, మలర్ బ్యూటీ సాయి పల్లవి మెయిన్ లీడ్ పోషిస్తోంది. రకుల్‌తో పోల్చితే సాయి పల్లవికి ఈ సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
టీజర్, ట్రైలర్‌లలోనూ రకుల్‌కి పెద్దగా సీను లేదు. ఇక సినిమాలో కూడా అంతేనేమో అంటున్నారు. సూర్యకి భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తుంటే, ఓ ఆఫీసర్ పాత్రను రకుల్ పోషిస్తోంది. ఇక హిందీ విషయానికి వస్తే, 'దే దే ప్యార్ దే' మూవీలో ఏభై ఏళ్ల వయసున్న వ్యక్తికి ప్రియురాలి పాత్ర పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో రకుల్ హాట్‌నెస్ బీభత్సం చేసేస్తోంది. తమిళంలో గ్లామర్‌కి పెద్దగా చోటున్నట్లు కనిపించడం లేదు. ఇక ఈ రెండు సినిమాలు కొద్ది రోజుల వ్యవధిలోనే అంటే మే 17, మే 31 తేదీలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలూ రకుల్‌కి అత్యంత కీలకం. అసలే తెలుగులో హవా లేదు.
తమిళంలో వరుస సినిమాల్లో నటించినా స్టార్‌డమ్ దక్కలేదు. బాలీవుడ్‌లో డెబ్యూ మూవీ బెడిసికొట్టడంతో అంచనాలు తగ్గిపోయాయి. ఇక రకుల్ ప్రీత్‌సింగ్ ఆశలన్నీ ఈ రెండు సినిమాల పైనే. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప రకుల్ ఇక్కడైనా అక్కడైనా నిలదొక్కుకునే పరిస్థితి లేదు. మరోవైపు తెలుగులో సీనియర్ హీరోలకు ఆప్షన్‌గా మారింది రకుల్. ఆల్రెడీ నాగార్జునతో 'మన్మధుడు 2'లో నటిస్తోంది. బాలయ్య సినిమా కోసం రకుల్ పేరు పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారమ్.