'బాహుబలి' తర్వాత ప్రబాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబలి' క్రేజ్‌తో ఈ సినిమాపై భారీ బడ్జెట్ వ్యత్యిస్తున్నారు కానీ, సినిమాని ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ప్రమోట్ చేయడంలో 'సాహో' యూనిట్ విఫలమవుతోందనే టాక్ బాగా సర్క్యులేట్ అవుతోంది. 'బాహుబలి' అంత పెద్ద విజయం అందుకోవడానికి కారణం సినిమా తెరకెక్కించడంలో రాజమౌళి ఘనత కాదు.
ఆ సినిమాని మార్కెట్ చేయడంలో రాజమౌళి చూపించిన ఘనత అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రమోషన్‌లో రాజమౌళిని కొట్టేవారే లేరంతే అది పక్కా. కానీ, 'సాహో' విషయంలో అది మిస్సయ్యింది. ప్రచార చిత్రాల జోరు పెరిగాక, 'సాహో'పై అంతకు ముందు వరకూ ఉన్న అంచనాల తీరు మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రం. భారీ అంచనాలుంటాయి ప్రబాస్‌పై.. అలాంటిది ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో ఇంకెంత సమయస్ఫూర్తి పాఠించాలి చిత్రయూనిట్. కానీ, అదేమీ కనిపించడం లేదు 'సాహో' ప్రమోషన్స్‌లో. ఇప్పటికే ప్రమోషన్స్ పట్ల ఫ్యాన్స్ చాలా అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల రిలీజైన 'సయ్యా సైకో' అనే సాంగ్ అయితే, టోటల్‌గా బాలీవుడ్ ఫ్లేవర్‌ని నరనరాల్లో నింపేసుకుంది. అసలింతకీ 'సాహో'ని డైరెక్ట్ చేస్తోంది మన తెలుగు డైరెక్టరేనా.? అనే అనుమానం కలిగేలా చేసింది. ఈ అనుమానాలు పటాపంచలవ్వాలంటే, ప్రమోషన్‌లో ఫ్లేవర్ బాగా మార్చాలి. వీలైతే, రాజమౌళికి ప్రబాస్ డార్లింగే కాబట్టి, ఆయన సూచనలూ, సలహాలూ తీసుకోవడం మంచిదనీ ఫ్యాన్స్ ఇన్‌డైరెక్ట్‌గా ప్రబాస్‌కి సూచిస్తున్నారట. మరి ప్రబాస్ ఫ్యాన్స్ సూచనల్ని పాఠిస్తాడా? లేదా? వేచి చూడాలిక.