రిస్క్ చేయకపోతే, మిగిలేది రస్క్ మాత్రమే.. అంటూ ఓ కమర్షియల్ యాడ్‌లో ఓ యంగ్ హీరో డైలాగ్ చెప్పాడు బాగానే ఉంది. కానీ, ఆ రిస్క్ తన ఒక్కడితో పోతే ఫర్వాలేదు. కానీ, హీరోల విషయానికి వస్తే, ఆయన చేసే రిస్క్ ఎంతమందిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు చాలా చూసేశాం. అయితే, యంగ్ హీరో నాగశౌర్య ఈ రిస్క్ విషయంలో తనదైన శైలిలో స్పందించాడు. ఈ మధ్య రిస్క్ చేసి గాయపడిన వారిలో ఈయన కూడా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, ఆ షాట్‌లో తానెందుకు రిస్క్ చేయాల్సి వచ్చిందో నాగశౌర్య వివరించాడు. అది 14 నిమిషాల సీన్ అట. ఈ సీన్‌లో డూప్‌ని వాడితే, సీన్‌కి నేచురాలిటీ ఉండదనీ, అందుకే తానే చేయాల్సి వచ్చిందనీ చెప్పాడు. అయినా, సినిమా కోసం ఆ మాత్రం కష్టపడక తప్పదనీ, ఇక రిస్క్ అంటారా.? ఎవరూ కావాలని రిస్క్ కొని తెచ్చుకోరు. కానీ, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుడిలో శాటిస్‌ఫేక్షనే ఓ హీరోకి అసలు సిసలు విజయం తెచ్చిపెడుతుందనీ అంటున్నాడు నాగశౌర్య.
అవును డూప్‌తో చేస్తే డ్రమటిక్‌గా అనిపిస్తుంది. గతంలో పలు చోట్ల డూప్స్ సంగతి తెలిసిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. అంతా నేచురల్‌గా కనిపించాలి. అందుకే డూప్స్ వాడకంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలా యంగ్ హీరోస్‌కి రిస్క్ తప్పనిసరి కావాల్సి వస్తోంది. అదే మన హ్యాండ్‌సమ్ నాగశౌర్య కన్‌ఫామ్ చేశాడు.