అభిమాన హీరో సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తే.. ఎవరికైనా కోపం వస్తుంది. కొంతమందికి ఇంకాస్త ఎక్కువ వస్తుంది. రవితేజ అభిమానులు ఇప్పుడు శరత్ మాండవపై గుర్రుగా ఉన్నారు. కోపంతో ఊగిపోతున్నారు. `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రానికి శరత్ మాండవ దర్శకుడు.
ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. తొలి షోకే.... డిజాస్టర్ అని డిక్లేర్ చేసేశారు జనాలు. దాంతో.. రవితేజ అభిమానులకు కోపం వచ్చేసింది. ఈ సినిమా ఫ్లాప్‌కి కారణం.. దర్శకుడే అని, రవితేజ అంతగా నమ్మి, అవకాశం ఇస్తే, దుర్వినియోగం చేసుకొన్నాడని.. ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. ఇంకొందరైతే.. `నువ్వు కనిపించకు. కనిపిస్తే కొట్టేస్తాం` అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ట్విట్టర్లో సైతం... ఈ సెగ గట్టిగానే తగులుతోంది. శరత్ ని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈమధ్య రవితేజ సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్లుగా మారాయి. అయితే ఏ సినిమాకీ ఇంతిలా దర్శకుడ్ని ట్రోల్ చేయలేదు. రవితేజ శైలికి తగిన కథ కాదిది. రవితేజ నుంచి ఆశించే ఎంటర్టైన్మెంట్ ఏ కొశానా లేదు. పైగా పుష్ప రిఫరెన్సులు ఎక్కువ అయ్యాయన్నది అభిమానుల కంప్లైంటు. అందుకే రియాక్షన్ ఈ స్థాయిలో ఉంది. ఈ ఫ్లాపుతో శరత్ మాండవకి మరో సినిమా దక్కడం అనుమానమే.