టాప్ రెమ్యునరేషన్ అందుకుంటూ, టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెలామణీ అవుతున్న ముద్దుగుమ్మ నయనతార అడ్డంగా బుక్కయిపోయింది. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ అందించిన అవార్డు ఫంక్షన్ విచ్చేసింది నయనతార. ఇదే ఆమెను అందరికీ టార్గెట్ చేసింది. సదరు టీవీ ఛానెల్ వాళ్లు అందించిన అవార్డ్స్ అందుకోవడానికి నయన్ ఆ కార్యక్రమానికి విచ్చేసింది. అయితే, నయనతార ఎప్పుడూ బహిరంగ వేడుకల్లో కనిపించదు. స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. కానీ, ఏ సూపర్ స్టార్‌తో నటించినా ఆ సినిమా ప్రమోషన్స్‌లో అస్సలు భాగం పంచుకోదు. మొన్న వచ్చిన మెగాస్టార్ 'సైరా'కీ రాలేదు.
నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ 'దర్బార్' ప్రమోషన్‌లోనూ ఎక్కడా నయనతార కనిపించలేదు. అందుకే దర్శక, నిర్మాతలు ఆమెపై మస్త్ గుస్సా అవుతున్నారు. కష్టపడి తెరకెక్కించే సినిమాల ప్రమోషన్స్‌కి మాత్రం రాదు కానీ, అవార్డ్స్ అందుకోవడానికి మాత్రం వచ్చేస్తుందా.? అంటూ విమర్శిస్తున్నారు. ఎంతగా స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ప్రమోషన్స్‌లో పాల్గొనదు అనే బ్యాడ్ నేమ్ నయన్‌ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
పోనీ పబ్లిసిటీ ఈమెకి పడదా.? అంటే అదీ కాదు, ప్రియుడితో చేసే సరస సల్లాపాలు, వెకేషన్ టూర్స్, బర్త్‌డే పార్టీలు వగైరా వగైరా అన్నింటికీ సోషల్ మీడియాలో బోలెడంత పాపులారిటీ దక్కుతుంటుంది. అలాంటప్పుడు ప్రమోషన్స్‌కి రాకపోవడమేంటనేది ఎవ్వరికీ ఎప్పటికీ అర్ధం కాని ప్రశ్నే. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై మాత్రం గుర్రుమంటూ బాగానే రెస్పాండ్ అవుతూ ఉంటుంది నయనతార.