విజయ శాంతికి సరిలేరు వేరెవ్వరూ.? కానీ.!

మరిన్ని వార్తలు

లేడీ సూపర్‌ స్టార్‌గా, లేడీ అమితాబ్‌ టాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌.. ఇలాంటి పేర్లన్నీ ఆమెకే సరిగ్గా సూటవుతాయి. ఆమెనే విజయశాంతి. సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. రాజకీయాల్లోనూ అదే జోరు ప్రదర్శించింది. కానీ, రాజకీయాల్లో సక్సెస్‌ ఆమె తలుపు తట్టలేదు. అయినా ఆమెకు సాటి ఎవరూ లేరు. తన జీవితం ప్రజల కోసమే, 24 గంటలూ ప్రజలతోనే, ముఖ్యంగా ఆడవాళ్ల కోసమే తన పోరాటం అంటూ ఎప్పుడూ లెక్చర్లు ఇచ్చే విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి చొరవతో. అనిల్‌ కథ రాసుకునేటప్పుడే ఆ పాత్రలో విజయ శాంతిని ఊహించుకున్నారట.

 

ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు చేశారట. కానీ, విజయ శాంతిని ఒప్పించడం పెద్ద టాస్క్‌ అని చెబుతున్నాడు అనిల్‌ రావిపూడి. ఎలాగోలా ఆమెని ఒప్పించి, రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు. ట్రైలర్‌లో, ప్రచార చిత్రాల్లో ఆమె అప్పియరెన్స్‌ చూసేశాం. అంతా బాగానే ఉంది. కానీ, ఈ సినిమాలో విజయ శాంతి పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. ఎంత ప్రయత్నించినా, ఆ పాత్రను రివీల్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ ససేమిరా అంటోంది. డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న పాత్ర. చాలా ఎమోషన్స్‌ ఉంటాయి, ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా నచ్చుతుంది.. అంటున్నారు తప్ప పాత్ర ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. మహేష్‌కీ, ఈ పాత్రకీ ఏంటి సంబంధం.? అనేది కూడా తెలియడం లేదు. ప్రచార చిత్రాల్లో ఈ రెండు పాత్రలనూ చాలా సన్నిహితంగా చూపించారు. కానీ, వీరిద్దరి మధ్యా రిలేషన్‌షిప్‌ ఏంటనేది మాత్రం అస్సలు చెప్పడం లేదు. ఆ సస్పెన్స్‌ వీడాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయక తప్పదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS