తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నది.
GST పైన వివాదస్పద వ్యాఖ్యలు ఆ చిత్రంలో ఉన్నాయంటూ వస్తున్న వార్తల పై ఒక జాతీయ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ జాతీయ స్పోక్స్ పర్సన్ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ- ‘భారతదేశంలోని నటీనటులకి, రచయతలకి, దర్శకులకి బుర్ర లేదు, వారికి జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువే’ అనే వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీనికి కౌంటర్ వేస్తూ, ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ స్పందిస్తూ- మమల్ని అలా అనడానికి మీకు ఎంత ధైర్యం? అని ఎదురు ప్రశ్నించాడు. దీనితో ఒక్కసారిగా ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.
మొత్తానికి ఈ మెర్సల్ చిత్రానికి సంబందించిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారిపోయింది.