అదంతా తూచ్.. ఫైటర్ కు మణిశర్మేనట

మరిన్ని వార్తలు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'ఫైటర్'.  ఈ సినిమాకు మొదట మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓ రెండు నెలల క్రితం మాత్రం మణి శర్మను మార్చారని, ఆయన స్థానంలో మరో బాలీవుడ్ సంగీత దర్శకుడిని తీసుకున్నారని ప్యాన్ ఇండియా అప్పీల్ కోసం ఇలా చేసారని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడదంతా తూచ్ అంటున్నారు. అసలు ఈ సినిమాలో మ్యూజిక్ డిపార్ట్ మెంట్ కి సంబంధించిన మార్పుచేర్పులేవి జరగలేదట. ఈ సినిమాకు మణిశర్మే సంగీతం అందిస్తున్నారని,  ప్రస్తుతం ఆయన ట్యూన్లు కంపోజ్ చేయడం లో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. పూరి జగన్నాధ్ సినిమాలు అనగానే పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది, అందమైన లొకేషన్లలో, స్టైలిష్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాటలను చిత్రీకరిస్తారు పూరి జగన్నాధ్.

పూరి - మణిశర్మ కాంబినేషన్లో వచ్చే పాటలు అంటే ప్రేక్షకులకు కూడా ఎన్నో అంచనాలు ఉంటాయి. మరి మణిశర్మ ఈసారి కూడా అంచనాలు అందుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS