ప్రముఖ నటి రాధిక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం 'దేవుడే ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడాడు' అంటూ ట్వీట్ చేశారామె. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు వందమంది మరిణించారు. మరో వందమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలే రాధిక శ్రీలంక వెళ్లారు. సినామన్ గ్రాండ్ హోటెల్లో ఆమె బస చేశారు.
ఆదివారం ఆమె హోటెల్ ఖాళీ చేసి చెన్నై విమానం ఎక్కేశారు. రాధిక హోటెల్ విడిచి రాగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాంతో రాధిక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టైంది. ''నేను హోటల్ విడిచి పెట్టగానే ఈ దుర్ఘటన జరిగింది. నన్ను దేవుడే కాపాడాడు. ఉగ్రదాడి గర్హనీయం. ఇలా జరక్కుండా ఉండాల్సింది. ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్ని తలచుకుంటే నా హృదయం ద్రవిస్తోంది'' అని రాధిక ట్వీట్ చేశారు.