హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం ఓ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం కూడా స్వల్పమే అని స్టూడియో యాజమాన్యం ప్రకటించింది. ఓ సెట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇదేం కొత్త కాదు. గతేడాది కూడా ఇలానే ఓ సెట్ కాలి బూడిదైపోయింది. ఆ సెట్ విలువ కొన్ని కోట్లు. భీమా పాలసీ ఉండడంతో నష్టాన్ని భర్తీ చేసుకోగలిగారు. అన్నపూర్ణ ఏడు ఎకరాలలో బిగ్ బాస్ సెట్ ఉంది. అక్కడ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటన్నదే పెద్ద ప్రశ్న. కాకపోతే.. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా యాజమాన్యం గట్టి ఏర్పాట్లు చేసింది.