జాతి రత్నాలు సినిమాతో వెలుగులోకి వచ్చాడు దర్శకుడు అనుదీప్. అంతకుముందు పిట్టగోడ అనే సినిమా తీశాడు. ఇందులో శ్రీకాంత్ రెడ్డి హీరో.అప్పటి నుండే శ్రీకాంత్, అనుదీప్ పరిచయం. వాళ్ళ మధ్య మంచి స్నేహం వుంది. ఇప్పుడు అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షోలో శ్రీకాంత్ నే హీరో. నిజానికి అనుదీప్ జాతి రత్నాలు సినిమాల్లో శ్రీకాంత్ వుండాల్సింది. శ్రీకాంత్ ని ద్రుష్టిలో పెట్టుకునే ఆ సినిమాలో హీరో పాత్రకు శ్రీకాంత్ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి పంచుకున్నారు,
'' అనుదీప్ నాకు ఒక బ్రదర్ లాంటి వ్యక్తి. మాది పదేళ్ళ స్నేహం. పిట్టగోడ సరిగ్గా ఆడలేదు.అప్పుడే జాతి రత్నాలు కథ చెప్పాడు. అది వైజయంతి మూవీస్ కి వెళ్ళింది. అంత పెద్ద సంస్థలో అవకాశం నాకు రాదని అనుకున్నా. పేరు తీసేమని చెప్పా. కానీ అనుదీప్ శ్రీకాంత్ పేరునే కంటిన్యూ చేశారు.
ఆ సినిమా కథ చెప్పినపుడే పెద్ద విజయం సాధిస్తుందనిపించింది. ఇప్పుడు మా మధ్య సినిమాలు మించిన స్నేహం వుంది. పూర్ణోదయ లాంటి గొప్ప సంస్థలో ఫస్ట్ డే ఫస్ట్ షో చేయడం ఆనందంగా వుంది'' అని చెప్పుకొచ్చారు.