నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
దర్శకత్వం : పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డీజే చేతస్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
రేటింగ్ : 2.5/5
ఆగస్ట్ 25న దేశం మొత్తం షేక్ అవ్వుద్దని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. లైగర్ తో విజయ్ నేషనల్ సూపర్ స్టార్ అవుతాడని ప్రకటించారు పూరి జగన్నాథ్. ఇలాంటి సంచలనమైన ప్రకటనల మధ్య వచ్చిన లైగర్ టాలీవుడ్ కి మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియాలో మళ్ళీ టాలీవుడ్ పేరు మార్మరోగిపొతుందని నమ్మకాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలని లైగర్ అందుకున్నాడా ? నిజంగానే లైగర్ దేశాన్ని షేక్ చేశాడా ? అసలు ఏమిటీ లైగర్ కథ.
కథ:
లైగర్ (విజయ్ దేవరకొండ)ది కరీంనగర్. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్.ఎమ్.ఎ) ఛాంపియన్ కావాలని తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో కలసి ముంబై వస్తాడు.ఓ టీకొట్టు పెట్టుకొని బ్రతుకుతుంటారు. లైగర్ ఎమ్.ఎమ్.ఎ కోచింగ్ లో జాయిన్ అవుతాడు. లైగర్ ఫైట్స్ చూసి కోచ్ (రోనిత్ రాయ్ ) ఆశ్చర్యపడతాడు. నేషనల్ ఛాంపియన్ కావడం లైగర్ కి పెద్ద లెక్క కాదని, అయితే ఫోకస్ చెడిపోకుండా వుండాలని సూచనా ఇస్తాడు. కానీ తాన్య (అనన్య పాండే)తో ప్రేమలో పడతాడు లైగర్. తాన్య కూడా లైగర్ ని ప్రేమిస్తుంది. అయితే మాత్రం లైగర్‌కి నత్తి ఉందని తెలిసి దూరమవుతుంది. ప్రేమలో విఫలమైన లైగర్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా? అసలు తాన్య ఎందుకు లైగర్ ని రిజక్ట్ చేసింది ? లైగర్ అమెరికా ఎందుకు వెళ్ళాడు ? మైక్ టైసన్, లైగర్ లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు ? అనేది మిగతా కథ.
విశ్లేషణ :
మార్షల్ ఆర్ట్స్ నేపధ్యం వున్న సినిమాలు టాలీవుడ్ కి కొత్తకాదు. పూరి ఖాతాలోనే అమ్మా నాన్నా తమిళమ్మాయి లాంటి సూపర్ హిట్ వుంది. లైగర్ కోసం ఎమ్.ఎమ్.ఎ నేపధ్యాన్ని ఎంచుకున్నాడు. దీనికి ఒక ప్రేమ కథని జోడించాడు. అయితే ఆ రెండిని ప్రెసెంట్ చేసిన విధానం మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఒక భారీ ఫైట్ తో హీరోని పరిచయం చేసి.. హీరో చాలా బలవంతుడని ముందే చెప్పాడు పూరి. దీంతో హీరో ముందుకు ముందు ఎలాంటి ఫైట్లు చేసినా అతడే గెలుస్తాడని ప్రేక్షకుడు ఒక అంచనాకి వస్తాడు. రెండో పాయింట్ ప్రేమ కథ. ఈ ప్రేమ కథ స్పెషాలిటీ ఏమిటంటే.. ప్రేమించుకున్న సంగతి లైగర్, తాన్యలకు తప్పా ప్రేక్షకుడికి మాత్రం తెలీదు. ఇంత వెరైటీ ప్రేమ కథ పూరి సినిమాల్లో ఇదే మొదటిసారి. ఇక ఆ ప్రేమ కథలో ఇచ్చిన ట్విస్ట్ పూరి లాంటి దర్శకుడికి ఎంతమాత్రం తగదు. హీరో పాత్రకి నత్తి పెట్టారు. నిజానికి ఆ నత్తి అనేది అనవసరం. దానితో కథకు వచ్చిన లాభం ఏమీ లేదు.
ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి కొత్తదనం లేకపోయినా పాటలు ఫైట్లుతో ఎదో సోసోగా నడిపించారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఇలా నడిపించదానికి కూడా ఏమీ దొరకలేదు. సినిమా ఇంకా గంట మిగిలుండగానే లైగర్ నేషనల్ ఛాంపియన్ అయిపోతాడు. ఇంకో గంట ఏదోలా నడపాలి. నేషనల్ తర్వాత మిగిలుంది ఇంక ఇంటర్ నేషనలే. ఛలో.. అమెరికా. అక్కడ ఒక గంట పాటు ఫైట్లు చేసి.. చివర్లో కోకా పాటతో శుభం కార్డు వేస్తాడు. మధ్యలో మైక్ టైసన్ ఎపిసోడ్ వుంది. ఇది మాత్రం చాలా కామెడీగా వుంటుంది. మైక్ కుడి భుజం అంత కనిపించని విజయ్.. హీరో కాబట్టి మైక్ ని కొట్టేస్తాడు. అదీ కూడా కామెడీగా. అదొక్కటే ఇందులో కామెడీ ఎపిసోడ్.
నటీనటులు :
విజయ్ దేవర కొండ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. బాడీ అంత సేఫ్ లో ఉంచడం మామూలు విషయం. నత్తి నటన మాత్రం సినిమాకి మైనస్ అయ్యింది. డ్యాన్సలు, ఫైట్ల కోసం చాలా శ్రమించాడు.
అనన్య పాండే అందంగా వుంది. రమ్యకృష్ణ చెప్పే డైలాగులు కొంచెం ఓవర్ గా అనిపిస్తాయి. రోనిత్ రాయ్ కోచ్ గా ఓకే. విష్ రెడ్డి కూడా ఫైటర్ లా కనిపించాడు. చంకీ పాండే, అలీ. గెటప్ శ్రీను పాత్రలు పరిధిమేర వున్నాయి
టెక్నికల్ :
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. పాటలు గ్రాండ్ గా చిత్రీకరీంచారు. యాక్షన్ కూడా లవిష్ గా డిజైన్ చేశారు. నేపధ్య సంగీతం ఓకే అనిపిస్తుంది.
కెమరాపని తనం డీసెంట్ గా వుంది. పూరి డైలాగుల్లో మెరుపుల్లెవ్. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
ప్లస్ పాయింట్స్
విజయ్
ఫైట్స్, పాటలు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
ఎమోషన్ లేకపోవడం
ఫైనల్ వర్డిక్ట్ : లైగర్.. రాడ్ లగా దేంగే