సునీల్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'టూ కంట్రీస్'. ఎన్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయనే ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో సునీల్ హీరోయిన్ పక్కన జోవియల్‌గా జాలీగా నడుచుకుంటూ వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో స్విమ్మింగ్ పూల్ లొకేషన్, అక్కడక్కడా కొబ్బరి చెట్లూ ఆహ్లాదంగా రిచ్‌గా అనిపిస్తోంది. సునీల్‌కి జంటగా ఈ సినిమాలో మనీషా రాజ్ నటిస్తోంది. ఈ మధ్య సునీల్ కెరీర్ కొంచెం స్లోగా నడుస్తోంది. 'ఉంగరాల రాంబాబు' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సునీల్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.
క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కానీ సునీల్ లెంగ్త్‌కి అది సరిపోలేదు కాబోలు. ఆడియన్స్ ఏక్‌సెప్ట్ చేయలేదు. సో సునీల్ మళ్లీ రేసులో వెనకబడిపోయాడు. ఈ సారి మాత్రం రేసులోకి దూసుకెళ్తానంటున్నాడు 'టూ కంట్రీస్' సినిమాతో సునీల్. మలయాళంలో ఘన విజయం సాధించిన 'టూ కంట్రీస్' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులోనూ అదే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.
2015లో తెరకెక్కిన 'టూ కంట్రీస్' సినిమా మలయాళ వెర్షన్‌లో దిలీప్, మమతా మోహన్‌దాస్ నటించారు. అప్పట్లోనే ఈ సినిమా అక్కడ 50 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. అదే మార్కెట్‌ని సునీల్ తెలుగులో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి. వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న సునీల్‌కి ఓ మంచి హిట్ కావాలిప్పుడు. ఆ హిట్ 'టూ కంట్రీస్' ద్వారా దక్కుతుందో లేదో చూడాలిక. డిశంబర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.