తొలిచూపులోనే మెస్మరైజ్‌ చేసేసింది

మరిన్ని వార్తలు

'మాళవికా శర్మ' టాలీవుడ్‌కి కొత్తగా పరిచయమవుతున్న పేరు ఇది. వస్తూ వస్తూనే ఈ బ్యూటీ పేరు మార్మోగిపోతోంది. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'నేల టికెట్‌' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్టుగా జరిగిన 'నేల టికెట్‌' ఆడియో ఫంక్షన్‌లో ఈ బ్యూటీ సూపర్‌ హాట్‌గా డ్రెస్‌ చేసుకుని వచ్చింది.

 

హాట్‌ అంటే హాట్‌ కాదు. కెమెరా కన్ను తన వైపుకు తిప్పేసుకుందంతే. అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించింది. అందంగానూ ఉంది. సెక్సీ కాస్ట్యూమ్‌లో సో హాట్‌గా కనిపించింది. సినిమా విడుదల కాకుండానే అమ్మడి అప్పియరెన్స్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఓపెన్‌ ఫంక్షన్‌లోనే ఈ బ్యూటీ ఇంత ఓపెన్‌గా వచ్చిందంటే, ఇక సినిమాలో ఎక్స్‌పోజింగ్‌ ఫుల్‌ ఓపెనే అని అంచనా వేసేస్తున్నారు. చూడాలిక ఎక్స్‌పోజింగ్‌తో ఈ భామ టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటుందో లేదో. అన్నట్లు ఈ బ్యూటీ అప్పుడే మరో హాట్‌ ఆఫర్‌ దక్కించుకుందనీ సమాచారమ్‌.

 

అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే 'నేల టికెట్‌' చిత్రాన్ని కళ్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాని తెరకెక్కించి తొలి సక్సెస్‌ అందుకున్న ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌, రెండో సినిమానీ అక్కినేని కాంపౌండ్‌ హీరోతోనే చేసి సెకండ్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ముచ్చటగా మూడో సినిమాగా రవితేజతో 'నేల టికెట్‌'ని రూపొందిస్తున్నాడు. గత చిత్రాల సక్సెస్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. దాంతో ఈ సినిమా కళ్యాణ్‌ కృష్ణకి హ్యాట్రిక్‌ తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS