హాట్ బ్యూటీ కేథరీన్ డాన్సుల్లో దిట్ట అన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ బ్యూటీని స్పెషల్ సాంగ్స్ కోసం ఎక్కువగా ఆఫర్ చేస్తుంటారు మన దర్శక, నిర్మాతలు. జోష్‌ఫుల్ అండ్ గ్లామరస్ డాన్సులేయడంలో కేథరీన్‌ని అందె వేసిన చేయి. అయినా కానీ ఈ ముద్దుగుమ్మకి డాన్సుల్లో ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనట.
అందుకే విదేశాలకు వెళ్లి ప్రముఖుల వద్ద డాన్సింగ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుందట. అందులో భాగంగా ప్రస్తుతం కేథరీన్ అమెరికాలోని న్యూయార్క్‌లో సందడి చేస్తోంది. అక్కడ ఓ ప్రముఖ డాన్స్ నిపుణురాలి వద్ద డాన్స్ నేర్చుకునేందుకు జాయిన్ అయ్యింది. డిఫరెంట్ డాన్సింగ్ మూమెంట్స్‌లో శిక్షణ పొందుతోందట. త్వరలోనే తన టిపికల్ డాన్సింగ్ మూమెంట్స్‌తో కుర్రకారుకు స్పెషల్ కిక్ ఇవ్వబోతున్నానంటోంది కేథరీన్.
అందానికి అందం, ఆ అందాన్ని ఆరబోతగా చేసేందుకు అస్సలు అడ్డు గీతలే లేకపోవడం, యాక్టింగ్ టాలెంట్‌లోనూ తనదైన స్టైల్ అన్నీ ఉన్నా ఏదో అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మకి అన్నీ ఎక్కువే. కానీ ఆఫర్లే అరకొరగా అందుతుంటాయి. అయితే లేటెస్ట్‌గా ఈ హాట్ బ్యూటీ ఓ హాట్ ఆఫర్‌ని చేజిక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.
అదీ మెగా కాంపౌండ్‌లోనట. ఆ హాట్ ఆఫర్ కోసమే, డాన్సుల్లో ఇంకా బాగా ఆరితేరుతోంది కాబోలు ఈ ముద్దుగుమ్మ అని నెటిజన్లు భావిస్తున్నారు. చూడాలి మరి, కేథరీన్ హాట్ సొగసులు, డాన్సుల్లో మెలికలు ఇంకెంతగా కుర్రోళ్ల గుండెల్ని కొల్లగొట్టేస్తాయో.!